Saturday, July 13, 2019

గ - ఘ >>>> 8

* గుడి ముఖం ఎరుగని దాసరి గుడివెనుక దండం పెట్టినాడట.
* గుడీమేళం కాదు గుద్ద త్రిప్పను, ఇది నగరిమేళం నడుము విరుగుతుంది.
* గుడీలో ఉండి, గుడీరాళ్ళు తీసిందట.
* గుడిలో దేవునికి గుడ్డ లేకుంటే, వాకిట్లో దేవునికి వన్నెచీర అట.
* గుడీలో లింగంపోతే, నంబి శఠం పోయినట్లు.
* గుడిలో లింగంపోతే నడుమ నంబికేం నష్టం?
* గుడిసెకు చందిని, గుడ్డికి అద్దము ఏల?
* గుడిసేటికి ఇల్లాలు, గుత్త లంజ.
* గుడ్డకు జాడింపు, కూరకు తాలింపు, కోడలికి సాధింపులేకున్న ఇంపులేదు.
* గుడ్లమీద కోడిపెట్ట వలె.
* గుడ్డి ఎద్దు చేల్లో పడ్డట్లు.
* గుడ్డికంటికి కాటుక పెట్టినట్లు.
* గుడ్డికంటికి కుంచెడు కాటుకా?
* గుడ్డికంటికి గుదంచూపినా ఒకటే, అద్దంచూపినా ఒకటే.
* గుడ్డికంటికి పగలైతేనేమి? రాత్రైతేనేమి?
* గుడ్డికంటికి రెండు గూటాలు, మెల్లకంటికి రెండు మేళాలు.
* గుడ్డికన్నా మెల్ల మేలు.
* గుడ్డికన్ను చారడైతేనేమి? చిన్నదైతేనేమి?
* గుడ్డి కన్ను మూసినా ఒకటే, తెరచినా ఒకటే.
* గుడ్డికేమి కుందనపు చాయ?
* గుడ్డి గుణమెరుగదు, వడ్డి మొదలెరుగదు.
* గుడ్డి గుఱ్ఱము తట్ట గుగ్గిళ్ళు తిన పెద్ద.
* గుడ్డి గుఱ్ఱమెక్కి గుడి చుట్టనగునా?
* గుడ్డి గుఱ్ఱానికి గుగ్గిళ్ళు చేటు.
* గుడ్డి గుఱ్ఱానికి దారి ఒకటే.
* గుడ్డిగేదెలలో గూనిగేదె శ్రీమహాలక్ష్మి.
* గుడ్డిదానితో పోతే గుడిసెదాకా సాగనంపాల.
* గుడ్డిది బెదిరిస్తే, బిత్తరపోయి బావిలో పడినాడంట.
* గుడ్డిది నీళ్ళకుపోతే ముగ్గురికి చేటు.
* గుడ్డినక్క ఊరినపడినట్లు.

No comments:

Post a Comment