* దూడలేని పాడి దుఃఖపు పాడి.
* దూడ వగచునె భువి తోడేలు చచ్చిన.
* దూదేకులవాడికి తుంబ తెగులు (తుంబతెగులు=దూది ఏకేటప్పుడు కలిగే చప్పుడు).
* దూదేకుల సిద్దప్పకు దూదేకను రాదంటే లోటా? (దూదేకుల సిద్దప్ప= బ్రహ్మంగారి శిష్యులలో మహాజ్ఞాని).
* దూబరతిండికి తూమెడు, మానవతికి మానెడు.
* దూబరతిండికి దూండ్లు బతకవు, ఆణి మొద్దుకు ఆండ్లు బతకవు.
* దూరం గుడికట్టితే (చంద్రుని చుట్టు) దగ్గరవాన, దగ్గర కడితే దూరపువాన.
* దూరదర్శనితో చూచినకొండ చిన్నదిగా కంపించును, భూతద్దములో చూచిన పెద్దదిగా కంపించును.
* దూరపు కొండలు నునుపు.
* దూరపు దండం కోటి లాభం.
* దూల పెట్టేచోట దుడ్డుకోల పెట్టినట్లు.
* దూస్తే దోసెడు, ఊడితే హుళక్కి.
* దెప్పె ఎక్కినట్లు, దేవుడికి మొక్కినట్లు.
* దెబ్బకు దెయ్యం వెరుస్తుంది.
* దెబ్బకు దేవేంద్రలోకం కనపడుతుంది.
* దెసబత్తెలవానికి బరిబత్తలవాడు బావమరిది (దెసెబత్తలు=దిసమొల).
* దేవతలకు దుమ్ము, రాక్షసులకు మన్ను.
* దేవతలు నాశంచెయ్యాలనుకున్న వానికి ముందు పిచ్చి పట్టిస్తారు.
* దేవర చిత్తం, దాసుడి భాగ్యం.
* దేవర చిత్తం, దీనుడి భాగ్యం.
* దేవర సవాసేరు, లింగం సేరు.
* దేవళం మింగేవాడికి ధ్వజస్తంభం లొటలొట.
* దేవాంగులలో వా దించరాదు (వా అనే అక్షరం కొట్టివేయరాదు).
* దేవియున్న గృహము దేవార్చన గృహము.
* దేవుడని మొక్కితే, దెయ్యమై పట్టుకొన్నట్లు.
* దేవుడికి ముడుపు, దెయ్యానికి మంత్రం.
* దేవుడి పట్టుకంటే, దెయ్యపుపట్టు ఎక్కువ.
* దేవుడీ పెళ్ళికందరూ పెత్తనగండ్లే (పెద్దలే).
* దేవుడిస్తాడు గానీ వండి వార్చి వాత కొడతాడా?
* దేవుడు కూరగాయలిస్తే దెయ్యం వంటవాని నిచ్చింది.

No comments:
Post a Comment