Saturday, July 13, 2019

గ - ఘ >>>> 9

* గుడ్డి పెండ్లానికి చెవిటి మగడైనట్లు.
* గుడ్డి మామగారు! నమస్కారమయ్యా అంటే రంధికి మూలమా ఱంకు కోడలా అన్నాడట.
* గుడ్డి మొగుడికి రేజీకటి పెండ్లం.
* గుడ్డివాడెరుగునా గురుతైన రత్నంబు.
* గుడ్డివాడి ఉపాయం గుడ్డివానిది, గూనివాని ఉపాయం గూనివానిది.
* గుడ్డివాని కన్ను రాగోరునా? పోగోరునా?
* గుడ్డివాని కాలు కుంతివాని కాధారమైనట్లు.
* గుడ్డివాడి చేతినూలు కదుట్లో పడుతుందో దిండులో పడుతుందో?
* గుడ్డివాడు అలావు తొక్కినట్లు.
* గుడ్డివాడు ఎటు రువ్వినా గురే.
* గుడ్డివాడు కోట కోల్పోయినట్లు.
* గుడ్డివాళ్ళ రాజ్యంలో ఒంటికన్నువాడే రాజు.
* గుడ్డివాళ్ళు ఏనుగు అంగాన్ని పట్టూకొని ఒక్కొక్క విధంగా వర్ణించినట్లు.
* గుడ్డివేటు గువ్వకి తగిలినట్లు.
* గుడ్డీ! రావే గుడీకిపోదామూ అన్నట్లు.
* గుడ్డుపెట్టబోయే కోడి కేరినట్లు.
* గుడ్డు పెట్టలేక పెట్ట చస్తుంటే, తొక్కను పుంజు చూస్తుండినట్లు.
* గుడ్డువచ్చి పెట్టను గోరడాలాడిన విధము.
* గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు.
* గుడ్డేద్దు చేల్లో(గడ్డిలో) పడినట్లు.
* గుడ్లగూబను చంకలోబెట్టుకొని బయలుదేరినట్లు.
* గుడ్లు తిన్నదికాక గూడెక్కి అరచినట్లు.
* గుణముమానవే గూటాలపోలీ అంటే, నా మనువైనా మానుతాను గానీ నాగుణం మాననన్నదట.
* గుణము కొఱకా గునుగు కొఱకా వచ్చింది.
* గుణములేకయున్న గుణహీనురాలయా.
* గుణములేకయున్న కుదురునా యూహలు?
* గుణమేమి చేసిందే గునక కడ్డీ? అంటే, ఎప్పటి నాపేరు పంగలకడ్డీ అందట.
* గుత్తికి పోయి గూటాం తెచ్చుకున్నట్లు.
* గుద్ద ఒక్కటి గూటాలు పది.
* గుద్ద నొప్పి గుడ్డుపెట్టే పెట్టకి తెలుసు.

No comments:

Post a Comment