* పరనింద గృహక్ష్యం, యతినింద కులక్షయం.
* పరమవంధ్యకు పాలుపెరుగు పోయగానే చంటిపాలు కలుగనేర్చునా?
* పరసతి గమనంబు ప్రత్యక్ష నరకంబు.
* పరమానందయ్యగారి శిష్యుడు
* పరాయిపిల్ల గాజులు పెడితే పైకానికి చేటు.
* పరాశికాల బాపనయ్యకు పాముకరిస్తే, మందులేక మరణమైనాడు (పరాశికాల=పరిహాసాల).
* పరిగేరుకొనేదానికి ఓదె దొరికినట్లు. (పరిగె=పైరుకోసిన చేల్లో జారిపడిన వెన్నులు; ఓదె=పైరుకోసి ఎండుటకు చాళ్ళు చాళ్ళుగా వేసినది, పన).
* పరిగనేరిన పాతట్లోకి ఆగునా?
* పరిగేరిన గింజలు కరువు కడ్డం రావు.
* పరిచయానికి ప్రథమచుంబనానికి మధ్య నున్న కాలాన్ని ఆదర్శ ప్రేమ అంటారు.
* పరిహాసం పైన వేసుకొని, జాణతనం చేతపట్టుకొని జాతరకు పోయినాడట.
* పరుగెత్తి పాలు తాగేకన్నా, నిలబడి (నిలుచుండి) నీళ్ళు తాగేది మేలు.
* పరుగెత్తి పసూలుకాస్తే పొద్దు కూకుతుందా? (కునుకుతుందా?)
* పరుగెత్తు పందకు కాంతలతోడి చింతయా?
* పరుగెత్తే పాముకు పాదములు కల్పించుట, అల్లనేరేడుపండ్లను తెల్లచేయుట వంటిది.
* పరుగెత్తే ఎద్దునే తరిమేది
* పరుగెత్తే వాణ్ణి చూస్తే, తరిమేవాడికి లోకువ.
* పరుల సొమ్ము పాపిష్టి సొమ్ము
* పరుల సొమ్ము పేలపిండి, తన సొమ్ము దేవుడి సొమ్ము.
* పరు విచ్చి పరువు తెచ్చుకొ.
* పరువుకీ, కరువుకీ డబ్బు.
* పరువు తప్పిన బ్రతుకు రోత, సతికిచాలని పురుషుని బ్రతుకు రోత.
* పరువులేని నడపీనుగకు ఊరేమి? పాడేమి?
* పలకమ్మ పున్నానికి పడమటికొమ్మ పూస్తుంది. (పలకమ్మ=పున్నమ, మార్గశిర పూర్ణిమ).
* పలకమ్మ పున్నానికి పడుగులు పడతాయి.
* పలుకని వాళ్లతో పదిఊళ్ళ వాళ్ళయినా గెలువలేరు.
* పలుకు తేనెపట్టు, పిడకిలి కోతిపట్టు.
* పలుకులేమో పంచదార, నిలువెల్లా బొంకులపుట్ట.
* పలుకులు బంగారం, గుణము పాలకన్నా పలుచదనము.
* పలుగాకులకు తల్లి పార్లపల్లి.

No comments:
Post a Comment