* నాలుగుకాళ్ళ జీవాలలో మేక మెత్తన, రెండుకాళ్ళ జీవాలలో కోమటి మెత్తన.
* నాలుగు వర్షాలు కురిస్తే, నత్తకాయ (గుల్ల) నాయకురాలు.
* నాలుగేళ్ళు నంజుకొని, నడిమేలు గుంజుకో.
* నాళ్ళలోకెల్ల చిన్ననాడే మేలు.
* నా వీపు నీవుగీరు, నీ వీపు నేను గీరుతా నన్నట్లు. (ఒకరినొకరు పొగడికొనుట).
* నా వ్రేలితో నా కన్నే పొడిచాడు.
* నాశనం - నల్లబొగ్గులు.
* నా సద్ది తెచ్చి నీ ఇడుపున పెట్టుకొని తినడమెందుకు? (ఈదుపు=పని నడుమ సేదతీర్చుకునే చోటు).
* నిండా మునిగినవానికి చలి ఏమి? గాలేమి?
* నిండి దరిచేర నీయదు గండ్లకమ్మ, కలిగి తిననీయదు గంపకమ్మ.
* నిండిన కడుపుకు అన్నం, బట్టతలకు నూనె
* నిండిన కడుపు నిక్కి మాట్లాడును.
* నిండిన కడుపు నీతి వినదు (ఎరుగదు).
* నిండుకుండ తొణకదు.
* నిండుటేరు నిలచి పాఱును.
* నిండుబండికి (పేడ) చేటగూడా బరువే.
* నింద లేనిదే బొందె పోదు.
* నిక్కు నీలపల్లెలో, బ్రతుకు మాలపల్లెలో.
* నిగాదారుని పెళ్ళం నీళ్ళకొస్తుంది, సావిట్లోవాళ్ళు చాటుకు జరగండి అన్నదిట.
* నిజమాడితే ఉండూరు అచ్చిరాదు.
* నిజ మాడితే నిష్టూరం.
* నిజము కుఱచ, బొంకు పొడవు.
* నిజము చెప్పేది పసిబిడ్డలు, తప్ప తాగినవాళ్ళు.
* నిజము దేవు డెఱుగు, నీరు పల్ల మెఱుగు.
* నిజమునకు నింద వచ్చును గానీ, అవమానము రాదు.
* నిజము నిలకడమీద తెలుస్తుంది.
* నిజమైన బంగారు నిప్పుకు వెరువదు.
* నిజమైన ఱంకులాడికి నిష్టలు మెండు.
* నిట్టలు ద్రొక్కకు పిల్లా! అంటే, నా మగనికి నేను రెండో సంబంధం అన్నదట.
* నిట్రాళ్ళ యిల్లయినా నిర్వంశంగా ఉండరాదు. (నిర్వంశం=వెదురు లేకుండా, నిస్సంతుగా నని పైకి అర్ధం).

No comments:
Post a Comment