Saturday, July 13, 2019

చ - ఛ >>>> 9

* చిన్నక్కను పెద్దక్కను, పెద్దక్కను చిన్నక్కను చేసినట్లు.
* చిన్న ఇల్లు కట్టుకొని పెద్ద కాపురం చేయవలె.
* చిన్నచేపను పెద్దచేప మింగితే, పెద్దచేపను బేస్తావాడు మింగుతాడు.
* చిన్ననాడులేవు, చంద్రశేఖరుడినాడు పోగులా?
* చిన్న నోటికి పెద్ద మాట.
* చిన్నన్న గుఱ్ఱం చిట్లికి పోయె, పెద్దన్న గుఱ్ఱం పెండ్లికి పోయే.
* చిన్నపామైనా పెద్ద కఱ్ఱతో కొట్టవలె.
* చిన్న పునర్వసు కార్తెలో చిట్టెడు విత్తితే గరిసెడు పండును.
* చిన్నపుల్లైనా పల్లుగుచ్చ పనికివస్తుంది.
* చిన్నప్పటినుంచి చింతకాయలు అమ్మి, ఆ వంకరటింకరకాయల పేరేమి రాజా? అన్నదిట.
* చిన్నమూ కావెలె, చిదరా కావలె, మేలిమీ కావలె, మెడా తిరుగవలె.
* చిన్నమ్మకు (పిన్నమ్మకు) మీసాలుంటే చిన్నాయన.
* చిన్నమ్మ సిందేస్తే, చీరదారి చీరది, సింగారందారి సింగారానిది.
* చిన్నమ్మ సింహద్వారాన్న వస్తే, పెద్దమ్మ పెరటిద్వారాన పోతుంది.
* చిన్న రాతితో ముడ్డీ తుడుచుకొని చేయ్యంతా పీయి చేసుకొన్నట్లు.
* చిన్నవాళ్ళు తింటే చిరుతిండి, పెద్దవాళ్ళు తింటే పలహారం.
* చిన్న నా పొట్టాకు శ్రీరామరక్ష.
* చిప్పతెచ్చుకోరా తిమ్మా అంటే, అట్లా చెప్పు మాయమ్మా అన్నాడట.
* చిమ(మ్మ)టను చీరేమి చేసింది? చీడపురుగును చేనేమి చేసింది?
* చిమ(మ్మ)ట సింగమా? గాజు రత్నమా?
* చిమడకే చినడకే ఓ చింతకాయ, నీవెంత చిమిడినా నీ పులుపు పోదు.
* చియ్యబువ్వ చీకులాట, గొల్లాడువస్తే గోగులాట.
* చియ్యోడొచ్చి, బువ్వోడిని తీసుకుపోయినట్లు.
* చిఱుతపులి కడుపున పెద్దపులి పుట్టినట్లు.
* చిలుంపట్టెవాడికి చిత్తం కుదరదు.
* చిలుంవదిలితేగానీ ఫలం దక్కదు.
* చిలుం వదిలితే చిద్రం (చిద్రం) వదులుతుంది.
* చిలుకకు చెక్కెర, చీమకు పంచదార.
* చిలుకకూన బ్రహ్మాస్త్రమునకు తగునా?
* చిలుక తనముద్దేకానీ ఎదుటిముద్దును కోరదు (ఎరుగదు).

No comments:

Post a Comment